News December 2, 2024

రాజ్యాంగంపై చర్చ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

image

పార్లమెంటు ఉభ‌య స‌భ‌ల్లో రాజ్యాంగంపై ప్ర‌త్యేక చ‌ర్చ‌కు <<14770377>>తేదీలు ఖ‌రార‌వ్వ‌డం<<>> దేశ రాజ‌కీయాల్లో ప్రాధాన్యం సంత‌రించుకుంది. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటి నుంచి రాజ్యాంగం చుట్టూనే NDA, INDIA రాజకీయాలు నడిపాయి. రాజ్యాంగాన్ని మార్చేస్తారని, పేదల హక్కులు లాక్కుంటారంటూ ఒక దానిపై ఒక‌టి దుమ్మెత్తిపోసుకున్నాయి. దీంతో పార్లమెంటులో రాజ్యాంగంపై జరగనున్న ప్రత్యేక చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది.

Similar News

News March 26, 2026

ఇళ్లు, ఆలయాల్లో ఎంత బంగారం ఉందో తెలుసా?

image

దేశంలోని ఆలయాలు, ఇళ్లలో దాదాపు 50వేల టన్నుల గోల్డ్ ఉంటుందని పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘం సభ్యుడు PP చౌదరి వెల్లడించారు. దీనివిలువ ₹942L Crగా అంచనా వేశారు. దీని ఫైనాన్షియలైజేషన్‌ను మరింత పెంచితే బులియన్ దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించవచ్చన్నారు. కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని తగ్గించవచ్చని చెప్పారు. కానీ గోల్డ్‌ను మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 26, 2026

ప్రదోషాల గురించి మీకు ఇవి తెలుసా?

image

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోషం అంటారు. ఆ తిథి ఏ వారంలో వస్తుందో దాన్ని బట్టి ఆ ప్రదోషానికి ప్రత్యేక నామం ఉంటుంది.
త్రయోదశి తిథి ఆదివారం వస్తే రవి ప్రదోషం. సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం. మంగళవారం వస్తే భౌమ ప్రదోషం. బుధవారం వస్తే బుధ ప్రదోషం. గురువారం వస్తే గురు ప్రదోషం. శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం. శనివారం వస్తే శని త్రయోదశి అని పిలుస్తారు.

News March 26, 2026

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.