News September 26, 2024

పీహెచ్సీ డాక్టర్లతో ముగిసిన చర్చలు

image

AP: పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు ముగిశాయి. అన్ని క్లినికల్ విభాగాల్లో 20 శాతం ఇన్ సర్వీస్ రిజర్వేషన్ ఇచ్చేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లో చేరాలని సత్యకుమార్ వారిని కోరారు.

Similar News

News September 27, 2024

సచిన్ రికార్డు విరాట్‌కు దక్కకపోవచ్చు: హాగ్

image

టెస్టు క్రికెట్‌లో సచిన్ అత్యధిక పరుగుల(15,921) రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీ(8871) వల్ల కాకపోవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. ‘విరాట్ ఆ రికార్డును అందుకుంటారని అనుకోను. ఆయన లయ కోల్పోయారు. వచ్చే 10 మ్యాచుల్లో గాడిలో పడకపోతే ఇక ఆ రికార్డు రేసు నుంచి విరాట్‌ తప్పుకొన్నట్లే. ఇప్పటికే 12వేల పరుగులకు చేరుకున్న జో రూట్‌‌కు సచిన్‌ను దాటే ఛాన్స్ ఉంది’ అని పేర్కొన్నారు.

News September 27, 2024

సెప్టెంబర్ 27: చరిత్రలో ఈరోజు

image

1915: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జననం
1926: ప్రముఖ తెలుగు నటి గరికపాటి వరలక్ష్మి జననం
1932: దర్శకుడు, నిర్మాత యశ్ చోప్రా జననం
1933: హాస్యనటుడు నగేశ్ జననం
1833: సంఘ సంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ మరణం
2001: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరణం
>>ప్రపంచ పర్యాటక దినోత్సవం

News September 27, 2024

మిజోరాం గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు

image

TG: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డిని మిజోరాం గవర్నర్‌గా నియమించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. దీంతో ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి గతంలో 3 సార్లు MLAగా, BJP రాష్ట్ర అధ్యక్షుడిగాను సేవలందించారు. ఇటు హరిబాబు గతంలో విశాఖ BJP ఎంపీగా పని చేశారు.