News January 9, 2025

చర్చలు సఫలం.. యథావిధిగా ఆరోగ్య శ్రీ సేవలు

image

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆస్పత్రులకు ఏడాది కాలంలో ప్రభుత్వం రూ.1100 కోట్లు చెల్లించిందని, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.730 కోట్లనూ చెల్లించినట్లు ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల రేట్లనూ 22శాతం పెంచామని గుర్తు చేసింది.

Similar News

News October 28, 2025

రేపు ఈ జిల్లాల్లో సెలవు

image

AP: తుఫానుతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కోనసీమ, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరులో సెలవు ఇచ్చారు. అటు కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు రేపు హాలిడే ప్రకటించారు.

News October 28, 2025

Way2News ‘తుఫాను’ అప్‌డేట్స్

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ రాత్రి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.

News October 28, 2025

9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు: CBN

image

AP: 403 మండలాలపై మొంథా ప్రభావం చూపుతోందని CM CBN తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. 7 జిల్లాల్లో ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ రాత్రి 9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ రాత్రి 11.30 తర్వాత తుఫాన్ తీరం దాటవచ్చని చెప్పారు.