News August 8, 2024
UPSC అభ్యర్థికి వరల్డ్ వార్-2 నాటి వ్యాధి

‘పైలోనిడల్ సైనస్’ అనే వ్యాధితో బాధపడుతున్న ఓ UPSC అభ్యర్థికి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. లైబ్రరీ కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులలో తొలిసారి గుర్తించారు. పిరుదుల పైభాగంలో ఓ చీలిక ఏర్పడి, ఇందులో వెంట్రుకలు, చెత్త పేరుకుపోయి చీము పడుతూ ఉంటుంది. దీనివల్ల రోగికి తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది.
Similar News
News October 17, 2025
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్లో ఉద్యోగాలు

అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్: https://www.prl.res.in/
News October 17, 2025
పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా, కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్లు, బైకులు, ఇతర వాహనాలు నడిపేవారు ఈ సమయంలో నిదానంగా వెళ్లడం మేలు. అలాగే పాటు ఫాగ్లైట్స్, బీమ్ హెడ్లైట్స్ ఉపయోగించాలని, ఓవర్టేక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News October 17, 2025
లోకేశ్కు కర్ణాటక మంత్రి కౌంటర్: YCP నేతలు

AP: పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>స్పైసీ ట్వీట్<<>>కు కర్ణాటక IT మంత్రి ప్రియాంక్ ఖర్గే కౌంటర్ ఇచ్చారని YCP నేతలు చెబుతున్నారు. ‘అందరూ స్పైసీ ఇష్టపడినా, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పొరుగువారి అప్పులు రూ.10లక్షల కోట్లకు పెరిగాయి. ఏడాదిలోనే రూ.1.61లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. రెవెన్యూ లోటు మరింత దిగజారి 2.65%-3.61%కి పెరిగింది’ అని ఖర్గే ట్వీట్ చేశారు.