News August 29, 2024
ఇక నుంచి మహిళా పోలీస్ స్టేషన్లుగా దిశ పోలీస్ స్టేషన్లు

AP: దిశ పోలీస్ స్టేషన్ల పేరును మహిళా పోలీస్ స్టేషన్లుగా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-2019 టీడీపీ హయాంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను వైసీపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో వాటి పేర్లను పునరుద్ధరించింది.
Similar News
News October 15, 2025
అఫ్గాన్ ప్లేయర్లకు టాప్ ర్యాంకులు

ICC ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు సత్తా చాటారు.
*వన్డే బౌలర్లలో రషీద్ ఖాన్‌కు నం.1 ర్యాంక్
*వన్డే ఆల్రౌండర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్కు నం.1 ర్యాంక్
*వన్డే బ్యాటర్లలో ఇబ్రహీం జర్దాన్‌కు రెండో ర్యాంక్
> మరోవైపు భారత ప్లేయర్లు కూడా ర్యాంకింగ్స్ దక్కించుకున్నారు. టెస్టు బౌలర్లలో బుమ్రా, టీ20 బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వన్డే బ్యాటర్లలో గిల్, టీ20 బ్యాటర్లలో అభిషేక్ నం.1 ర్యాంకుల్లో ఉన్నారు.
News October 15, 2025
స్పామ్ కాల్స్ రావొద్దంటే ఇలా చేయండి!

గత కొన్నేళ్లుగా స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తాం అంటూ పదేపదే కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారు. అలాంటి కాల్స్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రాయ్ DND (Do Not Disturb) అనే విధానం తీసుకొచ్చింది. 1909 నంబర్‌కు కాల్ లేదా SMS చేసి టెలిమార్కెటింగ్ కాల్స్ రాకుండా బ్లాక్ చేయవచ్చు. లేదా DND యాప్ నుంచి నేరుగా టెలి కమ్యూనికేషన్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.
Share it
News October 15, 2025
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్టుల స్టేటస్లు మిస్ అవకుండా నోటిఫికేషన్ వచ్చేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ట్రయల్ చేస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్లో ఈ ట్రయల్ కొనసాగుతోంది. యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్ట్ స్టేటస్‌పై క్లిక్ చేసి పైన త్రీ డాట్స్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ‘Get notifications’ ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆ కాంటాక్ట్ స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.