News October 7, 2025

ప్రభుత్వంపై భ్రమలు తొలగిపోయాయి: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని YSRCP చీఫ్ YS జగన్ పేర్కొన్నారు. ‘వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. అరాచకం, అవినీతి రాజ్యమేలుతోంది. పాలనపై ధ్యాస లేదు. తమ ఆదాయం పెంచుకోవాలన్న దానిపైనే కూటమి నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్ర ఆదాయం పక్కదారి పట్టి చంద్రబాబు, లోకేశ్, బినామీల జేబుల్లోకి పోతున్నాయి. కూటమి తీరు దోచుకో పంచుకో తినుకో అన్నట్లుంది. అన్నింట్లోనూ అక్రమాలే’ అని ఆరోపించారు.

Similar News

News October 7, 2025

స్టేడియంలోని స్టాండ్‌కు రవి కల్పన పేరు.. అసలు ఎవరీమె?

image

వైజాగ్‌లోని ACA-VDCA స్టేడియంలోని రెండు స్టాండ్‌‌‌‌లకు టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌ మిథాలీ రాజ్‌‌‌‌, తెలుగు ప్లేయర్ రవి కల్పన పేర్లను పెట్టనున్నారు. రవి కల్పన కృష్ణాజిల్లాలో జన్మించారు. సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టులో స్థానం సంపాదించారు. వికెట్ కీపర్-బ్యాటర్‌ అయిన ఈమె భారత్ తరఫున 7 వన్డే మ్యాచ్‌లు ఆడారు. స్టేడియంలోని ఆ కొత్త స్టాండ్లను అక్టోబర్ 12న ప్రారంభించనున్నారు.

News October 7, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 7, 2025

సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ

image

TG: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపైనా సీఎం సమాలోచనలు జరుపుతున్నారు.