News November 5, 2024
దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: ఓ విలేకరి హత్య కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తుని నియోజకవర్గం తొండంగికి చెందిన విలేకరి సత్యనారాయణ 2019 అక్టోబర్లో హత్యకు గురయ్యారు. దీనికి సూత్రధారి దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రాజా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.
Similar News
News October 24, 2025
పసుపును అంతర పంటగా ప్రోత్సహించాలి: తుమ్మల

పామాయిల్ సహా ఇతర పంటల్లో పసుపును అంతర పంటగా సాగుకు చర్యలు తీసుకోవాలని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అధిక నాణ్యత గల పసుపు రకాలను రైతులకు అందించి వాటి సాగును ప్రోత్సహించాలన్నారు. మంత్రి తుమ్మలను కలిసిన జాతీయ పసుపుబోర్డు కార్యదర్శి భవానిశ్రీ గత ఆరు నెలల్లో బోర్డు పనితీరును వివరించారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, గ్రైండర్లను రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
News October 24, 2025
ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు

కర్నూలు(AP) <<18087387>>బస్సు ప్రమాద<<>> ఘటనపై విచారణకు ఆదేశించామని TG మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల ఫిట్నెస్, ఇతర అంశాల్లో రూల్స్ పాటించకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని ప్రైవేట్ ట్రావెల్స్ను హెచ్చరించారు. ‘తనిఖీలు చేస్తే వేధింపులని అంటున్నారు. ఇవి వేధింపులు కాదు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే యాక్షన్’ అని చెప్పారు. ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని అన్నారు.
News October 24, 2025
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో మేనేజర్ పోస్టులు… అప్లై చేశారా?

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా( EPI) లిమిటెడ్లో 18 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 29 ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు, HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://epi.gov.in/


