News July 18, 2024

పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

AP: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా ఎన్నికల పోలింగ్ సమయంలో టీడీపీ ఏజెంట్‌, కారంపూడి సీఐపై దాడి ఘటనల్లో ఆయనకు మాచర్ల సివిల్ కోర్టు రిమాండ్ విధించింది.

Similar News

News January 6, 2026

31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 6, 2026

కిలో చికెన్ రూ.320.. మరింత పెరిగే అవకాశం!

image

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చికెన్ ధర స్కిన్‌లెస్ కిలోకి రూ.320 వరకు ఉంది. చాలాకాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటంతో చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. డిమాండుకు తగ్గట్లు సప్లయ్ లేకపోవడం వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కోడిగుడ్డు ధర కూడా రూ.8గా ఉంది.

News January 6, 2026

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు కూడా బాబా భక్తురాలే

image

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రిగ్జ్ సత్యసాయి బాబా భక్తురాలు కావడం విశేషంగా మారింది. మదురో స్థానంలో ఆమెను ఆ దేశ సుప్రీంకోర్టు నియమించింది. ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో పలుమార్లు పుట్టపర్తిని సందర్శించారు. 2023, 2024కి చెందిన ఆమె పర్యటనల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. <<18761400>>మదురో<<>> కూడా సత్యసాయిని గురువుగా భావించేవారు.