News February 5, 2025
భారత్తో వివాదం.. మాల్దీవుల టూరిజానికి భారీ దెబ్బ

INDతో దౌత్యపరమైన వివాదానికి దిగిన మాల్దీవులకు పర్యాటక రంగంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి 2023లో 2.09 లక్షలుగా ఉన్న ఇండియా టూరిస్టుల సంఖ్య 2024లో 1.30 లక్షలకు పడిపోయింది. మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో IND గతంలో టాప్లో ఉండగా ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. దీంతో ఈ ఏడాది ఇండియా నుంచి 3 లక్షల మంది టూరిస్టులను రప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్లు మాల్దీవుల అధికారులు తెలిపారు.
Similar News
News November 20, 2025
గింజ కోసం మొక్కజొన్న సాగు.. కోత సమయం ఇలా గుర్తించాలి

గింజ కోసం సాగు చేసే మొక్కజొన్న కోత సమయాన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుంచి కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగం పరీక్షిస్తే (కొన్ని రకాలలో) నల్లని చారలు కనిపిస్తాయి. ఈ సమయంలో పంట కోస్తే మంచి దిగుబడి వస్తుంది.
News November 20, 2025
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.
News November 20, 2025
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.


