News August 7, 2024
వినేశ్ ఫొగట్పై అనర్హత వేటు.. వారిపై చర్యలు తీసుకోవాలి: WFI

పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్పై అనర్హత వేటు పడటంపై WFI అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. ‘ఈ విషయంలో వినేశ్ తప్పేం లేదు. ఆమె అద్భుతంగా ఆడుతోంది. పతకం ఖాయం అనుకున్న టైంలో ఇలా జరగడం బాధాకరం. 2 రోజుల పాటు ఆమె బరువు స్థిరంగానే ఉంది. బరువు పెరగడంపై ఆమెతో అన్ని వేళలా ఉండే కోచ్, సపోర్ట్ స్టాఫ్, ఫిజియో, న్యూట్రీషియన్స్ బాధ్యత తీసుకోవాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 10, 2025
సౌతాఫ్రికా చెత్త రికార్డ్

నిన్న భారత్తో జరిగిన తొలి T20లో ఓటమితో SA జట్టు చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. ఆరుసార్లు 100 పరుగుల లోపు ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. ఇందులో మూడుసార్లు భారత్ ప్రత్యర్థి కావడం గమనార్హం. 2022లో 87 రన్స్, 2023లో 95 పరుగులకే SA ఆలౌటైంది. నిన్నటి మ్యాచ్లో 74 రన్స్కే ప్రొటీస్ బ్యాటర్లు చాప చుట్టేశారు. అలాగే IND చేతిలో అతి ఎక్కువసార్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్ల జాబితాలో SA 4వస్థానంలో ఉంది.
News December 10, 2025
నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

TG: హైదరాబాద్లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
News December 10, 2025
బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.


