News April 12, 2025

నిలిచిపోయిన UPI సేవలు

image

యూపీఐ పేమెంట్స్‌లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొందరేమో సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెట్‌వర్క్ స్లో అని వస్తుందని చెబుతున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదని అంటున్నారు. పదే పదే ఇదే తరహా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. మీకు ఇలాంటి సమస్యే ఎదురవుతోందా?

Similar News

News January 17, 2026

ఎడమవైపు తిరిగి పడుకుంటే..

image

ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్లు తెలిపారు. గ్రావిటీ వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. శరీరానికి రక్త సరఫరా మెరుగుపడి గుండెపై భారం తగ్గుతుంది. గర్భంతో ఉన్న మహిళలు ఎడమ వైపు తిరిగి నిద్రిస్తే శిశువు భంగిమ సరిగ్గా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వెన్ను సమస్య ఉంటే ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.
Share It

News January 17, 2026

మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు

image

AP: సంక్రాంతి పండుగను కుటుంబంతో ఆనందంగా గడిపిన ప్రజలు మధుర జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని పల్లెలకు వీడ్కోలు పలుకుతున్నారు. ఉద్యోగాలు, చదువుల కోసం తిరిగి నగరాల బాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా RTC ప్రత్యేక బస్సులు, SCR ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

News January 16, 2026

₹లక్ష పెట్టుబడికి ₹4 లక్షల రిటర్న్స్!

image

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది. 2019 జులై (సిరీస్-II)లో ₹లక్ష పెట్టిన వారికి నేడు వాటి విలువ ఏకంగా ₹4.15 లక్షలకు చేరింది. RBI ప్రకటించిన తాజా రిడెంప్షన్ ధర ప్రకారం.. గ్రాము బంగారం విలువ ₹14,092గా ఉంది. అంటే ఐదేళ్ల క్రితం ₹3,393కే కొన్న బాండ్లపై ఏకంగా 315% లాభం వచ్చింది. దీనికి అదనంగా ఏటా వచ్చే 2.5% వడ్డీ బోనస్! మీ దగ్గర SGBలున్నాయా? Comment