News February 4, 2025

పదవులు దక్కలేదన్న అసంతృప్తి చాలా చిన్నది: ప్రత్తిపాటి

image

AP: సీఎం కష్టంతో పోలిస్తే పదవులు దక్కలేదన్న అసంతృప్తి చాలా చిన్నది అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా ఎంపిక సరైన నిర్ణయమని తెలిపారు. ఆయన అనుభవం మండలికే వన్నె తెస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఆలపాటి గెలుపునకు ఇన్‌ఛార్జులు బాధ్యతగా పని చేయాలని ఆయన కోరారు.

Similar News

News March 17, 2026

‘ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం’.. అమెరికా ఉన్నతాధికారి రాజీనామా

image

ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్.. ట్రంప్‌కు షాకిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. మన దేశానికి ఇప్పటికిప్పుడు ఇరాన్‌తో ఎలాంటి ముప్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్, బలమైన అమెరికన్ లాబీ ఒత్తిడి వల్లే అమెరికా యుద్ధంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది’ అని పేర్కొన్నారు.

News March 17, 2026

IPL తొలి మ్యాచులకు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం!

image

IPL-2026 ప్రారంభంలో కొన్ని మ్యాచులకు AUS ప్లేయర్లు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. RCBకి ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్‌వుడ్ తొలి 2 మ్యాచులు ఆడకపోవచ్చని Cricbuzz పేర్కొంది. అటు SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPLలో లేట్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలిపింది. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 28న జరిగే ఓపెనింగ్ మ్యాచులో RCB, SRH తలపడనున్నాయి.

News March 17, 2026

తిరుమలలో గ్యాస్ కొరత.. పలు దుకాణాలు మూసివేత!

image

AP: తిరుమలలో గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పలు టీ షాప్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిర్వాహకులు మూసివేశారు. సిలిండర్ల కోసం గోడౌన్ వద్ద బారులు తీరారు. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది.