News June 28, 2024
బైడెన్‌పై అసంతృప్తి… ఇప్పుడు అభ్యర్థిని మార్చొచ్చా?

డొనాల్డ్ ట్రంప్‌తో డిబేట్లో US అధ్యక్షుడు జో బైడెన్ ప్రదర్శనపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న వేళ ఆయన అభ్యర్థిత్వం చర్చనీయాంశమైంది. బైడెన్ స్వయంగా తప్పుకుంటే తప్ప మార్పు దాదాపు అసాధ్యమనేది విశ్లేషకుల మాట. ట్రంప్‌కూ ఇదే వర్తిస్తుందంటున్నారు. ఇద్దరికీ వారి పార్టీల్లోని డెలిగేట్స్ మద్దతు ఉండటమే కారణం. త్వరలో సంబంధిత కన్వెన్షన్లలో పార్టీలు వీరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నాయి.
Similar News
News December 1, 2025
మేడారంపై గొంతు విప్పుతారా..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి WGL నుంచి కడియం కావ్య, బలరాం నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా మేడారం జాతర వచ్చే 2 నెలల్లో జరగనుంది. ఇప్పటికే నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల మేర నిధులను కేటాయించింది. మరో పక్క కేంద్రం మేడారంను జాతీయ పండగగా మార్చేందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఈ సీజన్లో గొంతు విప్పి అడిగి ఎండగడితే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది.
News December 1, 2025
ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నా..: JP

మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తున్నా కనీస విద్యాప్రమాణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో పాసైన వారిలో 20% విద్యార్థులకే సబ్జెక్టుల్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు.
News December 1, 2025
ఐటీ జాబ్ వదిలి.. ఆవులతో రూ.2 కోట్ల టర్నోవర్!

పని ఒత్తిడితో రూ.లక్షల జీతం వచ్చే IT కొలువు కన్నా, గోవుల పెంపకమే మేలనుకున్నారు అహ్మదాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మాల్డే, చార్మి దంపతులు. జాబ్ వదిలి, 2014లో 4 ఆవులను కొని వాటి పాలు, పేడతో ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మారు. కల్తీలేని గోఉత్పత్తులకు డిమాండ్ పెరగ్గా మరిన్ని ఆవులను కొన్నారు. కట్ చేస్తే 2024 నాటికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించారు. వారి సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


