News May 1, 2024

ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నాం: వికాస్‌రాజ్

image

TG: రాష్ట్రంలో అన్ని చోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు. 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు 155 కంపెనీల కేంద్రబలగాలు రాష్ట్రానికి రానున్నాయి. శుక్రవారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభం కానుంది. ఏమైనా సమస్యలు ఉంటే 1950కు కాల్ చేయవచ్చు’ అని తెలిపారు.

Similar News

News March 12, 2026

మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్

image

కరోనా కాలంలో మొదలై ఇప్పుడిప్పుడే పూర్తిగా తగ్గుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానం గ్యాస్ కొరతతో మళ్లీ తెరపైకి వస్తోంది. ఇవాళ, రేపు WFH చేయాలని చెన్నై ఆఫీస్‌ ఎంప్లాయీస్‌కి HCL టెక్ మెయిల్ చేసింది. క్యాంపస్‌‌లోని కేఫ్‌లో గ్యాస్ కొరతే దీనికి కారణమని పేర్కొంది. చెన్నైతో పాటు HYD, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ సంస్థలనూ గ్యాస్ షార్టేజ్ వేధిస్తోంది. దీంతో WFHలు పెరిగే అవకాశం ఉంది.

News March 12, 2026

ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక వార్నింగ్

image

గత 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్‌లైన్‌‌లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ వేధిస్తున్నారని రష్మిక వాపోయారు. 24గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని పేర్కొన్నారు. తన ఫ్యామిలీని కూడా లాగారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. 24గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ X వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.

News March 12, 2026

చామంతి మొక్కల తలల కత్తిరింపుతో కలిగే లాభం

image

చామంతి సాగులో అధిక దిగుబడి రావాలంటే మొక్కల తలల కత్తిరింపు తప్పక చేపట్టాలి. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్లు దాకా పెరిగిన తర్వాత వాటి తలలను తుంచేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కల తలలను తుంచాక నిపుణుల సూచనలతో నత్రజని, పొటాష్ ఎరువులను తగిన మోతాదులో అందిస్తే నాణ్యమైన పువ్వులను పొందవచ్చు.