News March 7, 2025
మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్‌ల పంపిణీ

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వం వినూత్న కార్యక్రమం ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో ఆసక్తిగల డ్వాక్రా మహిళలకు 1,000 ఈ-బైక్‌లు, ఆటోలను అందించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలువురు రైడర్లకు వాహనాలను పంపిణీ చేయనున్నారు. కాగా అద్దెకు వాహనాలను నడిపేందుకు ఇప్పటికే ర్యాపిడో సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Similar News
News March 9, 2025
19న అశోక్ లేల్యాండ్ యూనిట్ ప్రారంభం

AP: కృష్ణా(D) బాపులపాడు(మ) మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ బాడీబిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 19న మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం ఎకరం రూ.16.50 లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించింది. ఇటీవలే పెండింగ్ పనులన్నీ పూర్తికాగా, ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ యూనిట్‌లో BS-6 ప్రమాణాలతో ఏటా 4,800 బాడీలు తయారుచేయగలరు.
News March 9, 2025
ఆలస్యమవుతున్న ‘రాజాసాబ్’? అదే కారణమా?

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సింహభాగం షూటింగ్ పూర్తయింది. అయితే ఓ విచిత్రమైన పరిస్థితి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ పూర్తైన ఫుటేజీ ఏకంగా మూడున్నర గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని తగ్గించేందుకు మూవీ టీం చెమటోడుస్తోందని సినీవర్గాలంటున్నాయి. ప్రభాస్ ఇందులో తాత, మనవడి పాత్రల్లో కనిపిస్తారని టాక్.
News March 9, 2025
రూ.40వేల కోట్లతో అమరావతి పునర్నిర్మాణం

AP: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఈ నెల 12-15 మధ్య అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానున్నాయి. ₹48వేల కోట్లతో 73 పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. వీటిలో ₹40వేల కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలవగా, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలు ఖరారయ్యాయి. రేపటి సమీక్షలో సీఎం CBN వీటికి ఆమోదముద్ర వేయనున్నారు. ఈ పనుల కోసం వరల్డ్ బ్యాంక్, ADB, హడ్కోల ద్వారా GOVT ₹31వేల కోట్ల రుణం తీసుకోనుంది.