News August 1, 2024

నేడు చంద్రబాబు పెన్షన్ల పంపిణీ

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్‌లో నంద్యాల జిల్లా శ్రీశైలం చేరుకుంటారు. మల్లన్నను దర్శించుకుని, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జల హారతి ఇస్తారు. మధ్యాహ్నం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరకు వెళ్తారు. గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సాయంత్రం పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరిగెళ్తారు.

Similar News

News March 10, 2026

‘ఒక్క లీటర్ ఆయిల్ కూడా పోనివ్వం’.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

image

ఆయిల్ సప్లైని ఆపితే భారీ మూల్యం తప్పదన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగితే శత్రు దేశాల ఆయిల్‌ను కదలనివ్వబోమని US మిలిటరీ బేస్‌లున్న UAE, సౌదీ, ఖతర్ వంటి దేశాలను హెచ్చరించింది. ఇప్పటికే ఆయిల్ ధరలు పెరిగి ఆందోళనలో ఉన్న కంట్రీస్‌ను ఈ హెచ్చరికలు మరింత కలవరపరుస్తున్నాయి.

News March 10, 2026

రాజకీయాల్లో అరుదైన ఘనత.. ఈ నేతల స్పెషాలిటీ ఇదే

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికవగానే ఓ అరుదైన ఘనత సాధించనున్నారు. MLA, MLC, లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, సీఎం, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడిగా నిలవనున్నారు. ఇక ఉమ్మడి ఏపీలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి మినహా మిగతా పదవులను చేపట్టారు. అలాగే బెజవాడ పాపిరెడ్డి శాసన సభ, మండలి, రాజ్యసభ, లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలిసిన ఇలాంటి నేతలు ఉంటే కామెంట్ చేయండి.

News March 10, 2026

ఖరీఫ్‌కు ఎరువుల ఢోకా లేదు.. కానీ: FAI

image

రానున్న ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువులు ఉన్నాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. MAR 6 నాటికి 177.31L టన్నుల స్టాక్ ఉందని తెలిపింది. ఇందులో 59.30L టన్నుల యూరియా, 25.13L టన్నుల DAP, 55.87L టన్నుల NPKS ఉన్నట్లు పేర్కొంది. అయితే మిడిల్ ఈస్ట్ వార్, గ్యాస్ సరఫరాలో 40% కోత కారణంగా దేశీయంగా యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, దిగుమతి ఖర్చూ పెరుగుతుందని అభిప్రాయపడింది.