News March 30, 2025
నేటి నుంచే సన్న బియ్యం పంపిణీ

TG: రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం జనాభాలో 85 శాతం మందికి వీటిని అందిస్తారు. 3.10 కోట్ల మందికి నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,665 కోట్లు ఖర్చు చేయనుంది.
Similar News
News April 1, 2025
మా పాఠశాలల్లో తెలుగు, తమిళం బోధిస్తున్నాం: UP CM యోగి

త్రిభాషా విధానంలో భాగంగా తమ రాష్ట్రంలోని స్కూళ్లలో తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ తదితర భాషలు బోధిస్తున్నట్లు UP CM యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీనివల్ల తమ స్టేట్ ఏమైనా చిన్నదైపోతుందా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. త్రిభాషా విధానం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే TN CM స్టాలిన్ ఈ విధానంపై వివాదాలు రాజేస్తున్నారని యోగి మండిపడ్డారు.
News April 1, 2025
పిల్లల విషయంలో.. తల్లిదండ్రులకు మానసిక వైద్యుల సూచన

ఉద్యోగ జీవితంలో తల్లిదండ్రులు బిజీ అయిపోవడంతో పిల్లలు ఇరువురి ప్రేమకు దూరమైపోతున్నారు. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో ఒంటిరైపోతున్నారు. కానీ, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. వారితో కలిసి ఒక్కపూటైనా భోజనం చేయాలని, ఏ విషయమైనా మాట్లాడుతూ ఉండాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు ఓ కథ చెప్పడం, రోజులో ఏదో ఒక సమయంలో యాక్టివిటీలో పాల్గొనాలంటున్నారు.
News April 1, 2025
రూ.11 లక్షల జీతంతో ఉద్యోగాలు

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 182 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని పోస్టులకు BE, బీటెక్, ME, డిగ్రీ, CA, తదితర విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి. అన్ని పోస్టులకు వార్షిక వేతనం రూ. 11లక్షలు కాగా, వయసు 30ఏళ్ల వరకు ఉండొచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 11న ప్రారంభమై వచ్చే నెల 1తో ముగియనుంది. పూర్తి వివరాలకు https://www.ngel.in/careerను సంప్రదించండి.