News September 3, 2024
ఉచిత సరుకుల పంపిణీ.. ఏ జిల్లాల వారికంటే?

AP: వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని ₹4 లక్షల నుంచి ₹.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. చేనేత, మత్స్యకార కుటుంబాలకు 50KGలు, ఇతరులకు 25KGల బియ్యం, KG చొప్పున చక్కెర, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉచితంగా పంపిణీ చేయడంపై ఉత్తర్వులిచ్చింది. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం, ప.గో. కోనసీమ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బాధితులకు పంపిణీ చేయనుంది.
Similar News
News October 27, 2025
సెంచరీలతో రాణించిన కరుణ్, రహానే

టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు కరుణ్ నాయర్, అజింక్య రహానే ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచుల్లో సెంచరీలు చేశారు. గోవాతో మ్యాచులో కర్ణాటక తరఫున కరుణ్ 174* రన్స్‌తో రాణించారు. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచులో ముంబై బ్యాటర్ రహానే 159 రన్స్ చేశారు. మరి ఇండియన్ టెస్టు టీమ్‌లో వీరికి చోటు దక్కుతుందేమో చూడాలి.
News October 27, 2025
విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు: గొట్టిపాటి

AP: మొంథా తుఫాను నేపథ్యంలో 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉంటూ, విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఎక్కడైనా పవర్ సప్లైలో అంతరాయం కలిగితే 1912 నంబరును సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కిందపడిన విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.
News October 27, 2025
ప్రాణాంతక ‘కుందేటి వెర్రి వ్యాధి’.. చికిత్స

రక్త పరీక్ష ద్వారా పశువుల్లో కుందేటి వెర్రి వ్యాధిని గుర్తిస్తారు. వెటర్నరీ డాక్టర్ల సూచన మేరకు పశువు శరీర బరువును బట్టి, సురామిన్, క్వినాపైరమిన్, డైమినాజిన్ అసేట్యూరేట్, ఐసోమోటాడియమ్ క్లోరైడ్ ఇంజెక్షన్లను వాడవచ్చు. అలాగే వ్యాధి సోకిన పశువులను విడిగా ఉంచాలి. షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు కుట్టకుండా తెరలను ఉపయోగించాలి. పశువులకు శుభ్రమైన నీరు, మేత అందించాలి.


