News August 30, 2024
పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP: NTR భరోసా కింద ప్రజలకు అందించే పెన్షన్ల పంపిణీలో భాగమయ్యే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 వరకు వీరికి బదిలీలు ఉండవని ఆదేశాలు జారీ చేసింది. మిగతా ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి బదిలీలు చేపడతామని వెల్లడించింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం బదిలీలపై ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.


