News April 4, 2024

నేటి నుంచి 7 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభం

image

AP: వేసవి, వడగాలుల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉదయం 7 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వనుంది. మిగతా వారు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలి. అటు నిన్న 26 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెల 6వ తేదీలోగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Similar News

News October 7, 2024

లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. 10 మంది మృతి

image

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 10 మంది మృతి చెందారు. బారాషీట్‌లోని అగ్నిమాపక కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి సమయంలో స్థానికంగా రెస్క్యూ మిషన్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న 10 మంది పౌర రక్షణ సభ్యులు మరణించినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ చివర్లో ప్రారంభించిన ఇజ్రాయెల్ వరుస దాడుల్లో 1,400 మంది హెజ్బొల్లా సభ్యులు, పౌరులు మృతి చెందారు.

News October 7, 2024

కేంద్ర మంత్రులతో CM రేవంత్ భేటీ

image

ఢిల్లీలో ఉన్న CM రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌‌తో భేటీ అయ్యారు. మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహాకారం అందించాలని కోరారు. CSMPని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. HYDలో పురాత‌న మురుగుశుద్ధి వ్య‌వ‌స్థ‌ ఉంద‌ని, అది ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేద‌ని వివ‌రించారు.

News October 7, 2024

స‌మోసాలు, చిప్స్‌, కుకీలతో మధుమేహం!

image

స‌మోసాలు, చిప్స్‌, కుకీలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ మ‌ధుమేహానికి దారితీస్తున్నట్టు ICMR-MDRF ప‌రిశోధ‌న‌లో తేలింది. అధిక ఉష్ణోగ్ర‌త‌లో వండే ఈ ప‌దార్థాల్లో అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్(AGEs) అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు, గ్లూకోజ్ గ్లైకేష‌న్ ద్వారా ఇది ఏర్ప‌డుతుంది. అధిక AGEs ప‌దార్థాలు టైప్2 డయాబెటిస్‌కు కారణమని వైద్యులు చెబుతున్నారు. వేయించిన ఆహారాన్ని తిన‌డం త‌గ్గించాలని సూచిస్తున్నారు.