News October 18, 2025

ఆధార్, వెబ్ ల్యాండ్ ఆధారంగా రబీ ఎరువుల పంపిణీ

image

AP: రబీ సీజన్ ఎరువుల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబరు, వెబ్ ల్యాండ్‌లో రైతుకున్న భూకమతం ఆధారంగా.. పంటల వారీగా, అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఫారసు మేరకు ఎరువులను అందిచనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు. రబీ సీజన్ సాగు సన్నద్ధత, ఎరువుల పంపిణీ అంశాలపై శుక్రవారం జిల్లాల వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Similar News

News October 18, 2025

బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

image

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.

News October 18, 2025

పిల్లల ప్రశ్నలను గౌరవించి రిప్లై ఇవ్వండి: వైద్యులు

image

పిల్లల సృజనాత్మకత పెరగాలంటే వారు ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలని మానసిక వైద్యుడు శ్రీకాంత్‌ సూచించారు. ‘ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు సుమారు 300 ప్రశ్నలు అడుగుతారు. ఇది వారి అపారమైన ఉత్సుకతకు నిదర్శనం. తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు ఓపిగ్గా జవాబివ్వడం, తెలియని వాటికి తెలుసుకొని చెప్తా అనడం చాలా ముఖ్యం. ప్రశ్నించడాన్ని అణచివేస్తే వారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోవచ్చు’ అని హెచ్చరించారు.

News October 18, 2025

CCRHలో 31 పోస్టులు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<>CCRH<<>>) 31 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి LLB, CA/ICWA, డిగ్రీ, M.VSc, PG, PhD, MSc, ఎంఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 6, 7, 8, 10, 11, 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://ccrhindia.ayush.gov.in