News August 26, 2024

కాంగ్రెస్-ఎన్సీ మధ్య కుదిరిన సీట్ల పంపకం.. ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. 5 చోట్ల రెండు పార్టీలూ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేయనున్నాయి. ఒక చోట సీపీఎం, మరో చోట పాంథర్స్ పార్టీ పోటీ చేయనున్నాయి. JKకు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370, 35(A) పునరుద్ధరణ వంటి హామీలతో నయా కశ్మీర్ అజెండాను NC ప్రకటించింది.

Similar News

News March 30, 2026

భద్రాచలం: గోదావరి పుష్కరాలపై సీఎం సమీక్ష

image

2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి, 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, సమన్వయం కోసం ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News March 30, 2026

అమ్మ అయ్యాక ఆడపులినైపోయా: కియారా అద్వానీ

image

తల్లికావడంతో జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. తాను ఆడపులిలా మారిపోయానని.. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు జీవితాన్ని చూసే కోణం భిన్నంగా ఉందన్నారు. ఒక్కోసారి ఏదీ ముఖ్యం కాదని అనిపిస్తుంటుందని.. మరికొన్నిసార్లు అన్నీ ముఖ్యమనే భావన కలుగుతుంటుందని అన్నారు. గత ఏడాది ‘గేమ్ ఛేంజర్‌’లో మెరిసిన కియారా త్వరలో ‘టాక్సిక్‌‌’తో వెండితెరపై అలరించనున్నారు.

News March 30, 2026

ఈ నేలలు వేరుశనగ, నువ్వుల సాగుకు అనుకూలం

image

వేరుశనగ: ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్ఠం. చల్కా, ఎర్రగరప నేలలు కూడా అనుకూలం. ఎక్కువ బంక మట్టిగల నల్ల రేగడి నేలల్లో పంట వేయరాదు. నేల pH 6.5-7.0 ఉండి, 20-30 సెం.మీ లోతు వరకు దున్నడానికి వీలుగా ఉండాలి.
నువ్వులు: మురుగు నీరు నిలవని తేమ నిలిచే తేలికైన నేలలు అనుకూలం. నీరు నిలిచే ఆమ్ల, క్షార నేలలు పనికిరావు. ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు కూడా మంచి దిగుబడినిస్తాయి.