News January 12, 2025
బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ

AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.
Similar News
News January 22, 2026
గురువును మించిన శిష్యుడు.. యువీ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్

T20 క్రికెట్లో టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా NZతో జరిగిన మ్యాచ్‌లో తన గురువు యువరాజ్ సింగ్ (74 సిక్సర్లు) రికార్డును 33 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించారు. ప్రస్తుతం T20Iల్లో 81 సిక్సర్లతో భారత ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నారు. యువీ శిక్షణలో రాటుదేలిన అభిషేక్.. గురువును మించిన శిష్యుడిగా మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నారు.
News January 22, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’కు దారుణమైన కలెక్షన్లు

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ.0.48 కోట్లు(15%- థియేటర్ ఆక్యుపెన్సీ) వసూలు చేసిందని sacnilk తెలిపింది. తొలి వారం రూ.130 కోట్ల(నెట్) కలెక్ట్ చేయగా 13 రోజుల్లో మొత్తంగా రూ.141.98 కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటివరకు ఈ మూవీ 55శాతమే రికవరీ చేసిందని సినీ వర్గాలు తెలిపాయి.
News January 22, 2026
NALCOలో 110 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<


