News August 27, 2024
జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు: CM చంద్రబాబు

AP: 2047 నాటికి రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని CM CBN వెల్లడించారు. వికసిత్ AP-2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతిఆయోగ్ ప్రతినిధితులతో చర్చించారు. వచ్చే ఐదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా, లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
Similar News
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


