News May 26, 2024
పలు రైళ్ల దారి మళ్లింపు

TG: నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు <<13319560>>తప్పడంతో<<>> పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు పగిడిపల్లి-కాజీపేట-వరంగల్-కొండపల్లి మీదుగా విజయవాడ చేరుకుంటాయి. విజయవాడ-లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ గంట ఆలస్యంగా బయలుదేరనుంది. గూడ్స్ పట్టాలు తప్పిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Similar News
News December 13, 2025
రేపే రెండో విడత.. ఉ.7 గంటలకు పోలింగ్ స్టార్ట్

TG: రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. సెకండ్ ఫేజ్‌లో 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 స్థానాలు, 38,322 వార్డులకు 8,300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు.
News December 13, 2025
ఫేక్ డొనేషన్లతో క్లెయిమ్స్.. వారికి IT శాఖ హెచ్చరికలు

డొనేషన్ల పేరుతో బోగస్ క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దృష్టిపెట్టింది. చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తమ ఆదాయపన్ను రిటర్నులను విత్ డ్రా చేసుకోవాలని, ITRలను అప్డేట్ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు SMSలు, ఈమెయిల్స్ ద్వారా సమాచారమిస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులను రివైజ్ చేసినట్లు చెబుతోంది.
News December 13, 2025
21న 54 లక్షల మందికి పోలియో చుక్కలు

AP: నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఈనెల 21న రాష్ట్రంలో 54 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనికోసం 38,267 బూత్‌లు ఏర్పాటు చేసి 61,26,120 డోస్‌ల వ్యాక్సిన్‌ను రెడీ చేశామన్నారు. ఆరోజు చుక్కలు వేసుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.


