News February 7, 2025
ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్కు అలవాటే: కిషన్ రెడ్డి
TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్కు అలవాటే’ అని విమర్శించారు.
Similar News
News February 7, 2025
మోనాలిసా లక్కంటే నీదేనేమో….!
మోనాలిసా… కుంభమేళాలో తన ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ప్రస్తుతం ‘డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో నటిస్తోంది. దీనికి రెమ్యునరేషన్గా రూ.21లక్షలు తీసుకుందని సమాచారం. అంతేకాకుండా లోకల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ.15 లక్షలతో డీల్ చేసుకుందట. పూసలమ్మి రోజుకు రూ.1000 సంపాదిస్తే చాలనుకున్న మోనాలిసాకు ఇప్పుడు డబ్బుతో పాటు దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చేసింది. లక్కంటే ఇదేనేమో మీరేమంటారు.
News February 7, 2025
పవన్ సిక్ అయ్యాడా.. అలిగాడా?: అంబటి
AP: Dy.CM పవన్ కళ్యాణ్ నిజంగానే అస్వస్థతకు గురయ్యాడా లేదా షూటింగ్లో ఉన్నాడా అని YCP నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్పై పవన్ అలిగాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ ఒక్క హామీని నేరవేర్చలేదు. హామీలు అమలు చేయకుండా జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. కూటమి పాలనలో అన్నీ మోసాలు, దాడులు, అరాచకాలే. గ్యారంటీ ఇచ్చిన పవన్ కూడా అడ్రస్ లేడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News February 7, 2025
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన
TG: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.