News December 29, 2024
విభజన రాజకీయాలు ప్రమాదం: SC న్యాయమూర్తి
మతం, కులం, జాతి ఆధారిత విద్వేష వ్యాఖ్యలు దేశ ఐక్యతా భావాలకు పెను సవాల్ విసురుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. గుజరాత్లో ఓ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు చేసే ఈ రకమైన రాజకీయం సమాజంలో విభజనను పెంచుతుందన్నారు. విభజన సిద్ధాంతాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయం సోదర భావానికి ప్రమాదమన్నారు.
Similar News
News January 1, 2025
టెస్టుల్లో 148 ఏళ్లలో తొలిసారిగా గత ఏడాది ఆ ఘనత!
గత ఏడాది టెస్టు క్రికెట్లో ఓ ఆసక్తికర రికార్డు నమోదైంది. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా గత ఏడాది 53 టెస్టుల్లో 50 మ్యాచుల్లో ఫలితాలు వచ్చాయి. మూడు మ్యాచులు మాత్రమే డ్రాగా ముగిశాయి. ఇంగ్లండ్ 9 టెస్టులు, భారత్ 8, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక తలో ఆరేసి, బంగ్లా, ఐర్లాండ్, పాక్, వెస్టిండీస్ రెండేసి చొప్పున టెస్టులు గెలిచాయి.
News January 1, 2025
ముఫాసా.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..?
ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ‘ముఫాసా’ థియేటర్లలో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గత నెల 20న విడుదలైన ఈ మూవీకి తెలుగులో మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాకు కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. తాజాగా ఈ మూవీకి ఓటీటీ పార్ట్నర్గా హాట్ స్టార్ ఫిక్స్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. మార్చిలో హాట్స్టార్లో ఈ మూవీ స్ట్రీమ్ కావొచ్చని సమాచారం.
News January 1, 2025
ఉగాదే మన కొత్త సంవత్సరం: రాజాసింగ్
TG: తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాదేనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం పేరిట విదేశీ సంస్కృతిని భవిష్యత్ తరాలకు నేటి తరం అలవాటు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆంగ్లేయులు జనవరి 1ని మనపై రుద్ది వెళ్లారు. ఆ వలస సంస్కృతిని వదిలేద్దాం. ప్రభుత్వాలు, మేధావులు ఉగాదిని కొత్త సంవత్సరంగా అలవాటు చేయాలి. క్లబ్బులు, పబ్బులు భారత సంస్కృతి కాదు’ అని పేర్కొన్నారు.