News February 26, 2025

విడాకుల వార్తలు అవాస్తవం: ఆది పినిశెట్టి

image

తాను విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధాలని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. తాము సంతోషంగా జీవిస్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ స్వార్థం కోసం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోయిన్ నిక్కీ గల్రానీని 2022లో ఆది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నటించిన ‘శబ్దం’ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో చిత్రబృందం పాల్గొంది.

Similar News

News January 31, 2026

నెల్లూరు: విద్యార్థులకు గమనిక

image

కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే నెల 9వ తేదీన ప్రేరణ ఉత్సవం ఫేస్-2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డీఈవో బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్ఈ పాఠశాలలు, కళాశాలల్లో 8వ తరగతి నుంచి 11 విద్యార్థులు ముందుగా https://prerana. education.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News January 31, 2026

ఇజ్రాయెల్ వలలో ట్రంప్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దిమ్మతిరిగే నిజాలు!

image

ఎప్‌స్టీన్ తాజా ఫైల్స్ సంచలనం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ వలలో ట్రంప్ చిక్కుకున్నారని, ఆయన నిర్ణయాలపై ఆ దేశ ప్రభావం బలంగా ఉందని ఈ ఫైల్స్ వెల్లడించాయి. రష్యా పెట్టుబడులు, ఇజ్రాయెల్ అనుకూల నెట్‌వర్క్స్‌తో ట్రంప్ అల్లుడు కుష్నర్‌కు సంబంధాలు ఉండడంతో వైట్ హౌస్ నిర్ణయాలను ప్రభావితం చేశారని ఆరోపించాయి. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ Mossad కోసం ఎప్‌స్టీన్ లాయర్ పనిచేశారని ఈ రిపోర్ట్ పేర్కొనడం సంచలనంగా మారింది.

News January 31, 2026

సూర్యలానే సంజూను బ్యాకప్ చేయాలి: రైనా

image

NZతో జరుగుతున్న T20 సిరీస్‌లో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సంజూకు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచారు. కెప్టెన్ సూర్యకుమార్ ఏడాది పాటు రన్స్ చేయలేకపోయినా టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని బ్యాకప్ చేసిందని చెప్పారు. సంజూ విషయంలోనూ ఇలాగే జరగాలన్నారు. అతనికి అవకాశాలు ఇస్తూ ఉంటే కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారని రైనా అభిప్రాయం వ్యక్తం చేశారు. NZతో జరిగిన తొలి 4 T20ల్లో సంజూ 40 పరుగులే చేశారు.