News July 17, 2024
ఇన్స్టాలో విడాకులు ప్రకటించిన దుబాయ్ ప్రిన్సెస్

దుబాయ్ రాజు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె, ప్రిన్సెస్ షైఖా మహ్ర తన భర్త షేక్ మనా బిన్ మహమ్మద్కు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో ప్రకటించారు. దీనికి గల కారణాన్ని సైతం వెల్లడించారు. ‘డియర్ హస్బెండ్.. మీరు సహచరులతో ఎక్కువ సమయం గడుపుతున్నందున నేను మీకు విడాకులు ఇస్తున్నా. తలాఖ్, తలాఖ్, తలాఖ్. మీ మాజీ భార్య’ అని పోస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే ఈమె బిడ్డకు జన్మనిచ్చారు.
Similar News
News January 10, 2026
స్టార్ట్ కాకముందే విమర్శలా.. దీపిందర్ ఫైర్!

బ్రెయిన్ మ్యాపింగ్ డివైజ్ ‘టెంపుల్’పై వస్తున్న విమర్శలను జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ఖండించారు. ఈ పరికరం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మార్కెట్లోకి రాకముందే దీనిని వాడొద్దని వైద్యులు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. దీని వెనకున్న శాస్త్రీయ ఆధారాలను వెల్లడిస్తామని, అప్పటివరకు స్టార్టప్ల ప్రయత్నాలను ప్రోత్సహించాలని కోరారు. విమర్శలు చేసే ముందు వాస్తవాల కోసం వేచి చూడాలని ఆయన సూచించారు.
News January 10, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 10, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.23 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 10, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


