News October 31, 2024
దీపావళి: ఆ గ్రామంలో రావణుడి ఆత్మశాంతికి యజ్ఞం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిశ్రక్ గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోరు. రావణాసురుడు ఇక్కడే పుట్టారని ఇక్కడి ప్రజలు నమ్మడమే ఇందుకు కారణం. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఇక్కడే పుట్టి లంకకు వెళ్లి రాజ్యాన్ని పాలించారని నమ్ముతుంటారు. ఇక్కడి పురాతన శివలింగాన్ని రావణుడు, ఆయన తండ్రి విశ్రవసుడు పూజించారనేది స్థానిక కథనం. దీపావళి రోజున బాణసంచా కాల్చడానికి బదులు రావణుడి ఆత్మశాంతి కోసం యజ్ఞాలు చేస్తుంటారు.
Similar News
News November 22, 2025
ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్‌లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
News November 22, 2025
భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.
News November 22, 2025
ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.


