News October 30, 2024
దీపావళి: ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని APSDMA పేర్కొంది. ప్రజల మొబైల్స్‌కు అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. ‘అగ్నిప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించండి. బాణసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. ఇంటి కిటికీలు, తలుపులు మూసేయండి. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులు కాల్చాలి. టపాసులు వెలిగించి విచక్షణా రహితంగా విసరకండి’ అని మెసేజ్ పంపుతోంది.
Similar News
News December 9, 2025
బెస్ట్ రైస్ డిష్‌లో హైదరాబాద్ బిర్యానీ సత్తా

ప్రపంచ ప్రఖ్యాత ఆహార రేటింగ్ సంస్థ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన 2026 ‘బెస్ట్ ఫుడ్’ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. టాప్ 100 డిషెస్ జాబితాలో 72వ స్థానంలో నిలిచిన హైదరాబాదీ బిర్యానీ, ప్రపంచంలోని టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్‌లో 10వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సువాసనభరితమైన బాస్మతి రైస్, మసాలాలు హైదరాబాదీ బిర్యానీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
News December 9, 2025
‘స్టార్‌లింక్’ ధరలు ప్రకటించలేదు.. క్లారిటీ ఇచ్చిన సంస్థ

భారత్‌లో ‘స్టార్‌లింక్’ సేవల ధరలు ఇప్పటివరకు ప్రకటించలేదని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల స్టార్‌లింక్ ఇండియా వెబ్సైట్లో నెలకు రూ.8,600 ఛార్జీలు, హార్డ్‌వేర్ కిట్ రూ.34,000గా <<18504876>>చూపడాన్ని<<>> ‘కాన్ఫిగరేషన్ గ్లిచ్’గా కంపెనీ పేర్కొంది. అవి కేవలం డమ్మీ డేటా మాత్రమేనని, అసలు ధరలు ఇంకా ఫిక్స్ చేయలేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాకే సేవలు ప్రారంభమవుతాయని క్లారిటీ ఇచ్చారు.
News December 9, 2025
USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్‌తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.


