News October 31, 2024
దీపావళి అంటే బండ్ల గణేశ్‌కు పూనకమే!
టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఎప్పటిలాగే దీపావళి సెలబ్రేషన్స్‌లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. భారీగా క్రాకర్స్ కొనుగోలు చేశారు. షాద్‌నగర్‌లోని తన ఇంటిముందు పరిచి వాటితో ఫొటోకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతున్నాయి. దీపావళి అంటే బండ్లన్నకు పూనకమే వచ్చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News October 31, 2024
నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 9న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తామని రైలు పట్టాలపై రామ్‌చరణ్ చొక్కా లేకుండా కూర్చున్న ఫొటోను పంచుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
News October 31, 2024
పువ్వులతోనే దేవుడిని ఎందుకు పూజించాలి?
మనం నిత్యం భగవంతుడికి పువ్వులతోనే పూజ చేస్తుంటాం. ఏ పూజ అయినా పుష్పాలదే ప్రాధాన్యత. పుష్పాల్లో సర్వ దేవతలు ఉంటారని ప్రతీతి. పువ్వుల్లో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నమవుతారట. దేవుడికి పువ్వుల సువాసన అంటే మహా ఇష్టమని అంటారు. పుష్పం త్రివర్గ సాధనం కాబట్టి సంపద, స్వర్గం, మోక్షాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
News October 31, 2024
మహారాష్ట్ర: ఆ 12 సీట్లపై MVAలో అలజడి
మహారాష్ట్రలో విపక్ష మహావికాస్ అఘాడీలో 12 సీట్లు కాకరేపుతున్నాయి. నామినేషన్ల గడువు పూర్తవ్వడంతో 288 స్థానాల్లో 12 స్థానాల్లో MVAలోని రెండేసి పార్టీలు నామినేషన్లు వేశాయి. దీంతో ఫ్రెండ్లీ పోరు తప్పదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఇప్పటికే 2 కూటములు, 6 పార్టీల గుర్తుల విషయంలో ప్రజల్లో గందరగోళం ఉంది. నామినేషన్ల ఉపసంహరణలోపు సమస్యల్ని పరిష్కరించుకుంటామని MVA నేతలు చెబుతున్నారు.