News October 20, 2025
దీపావళి: నేడు ఏ రంగు దుస్తులు ధరించాలి?

దీపావళి లక్ష్మీ పూజలో పసుపు, ఎరుపు, తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. పసుపు(బృహస్పతి) సంపద, శాంతిని, ఎరుపు(కుజుడు) శక్తి, ధైర్యాన్ని, తెలుపు శాంతి, లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తాయని అంటున్నారు. నీలం, నలుపు రంగులు అశుభమని, ఆ రంగు దుస్తులు ధరించకూడదని అంటున్నారు. నైలాన్, పాలిస్టర్‌లకు దూరంగా, కాటన్, పట్టు వంటి సురక్షితమైన వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం’ అంటున్నారు.
Similar News
News October 20, 2025
సౌతాఫ్రికాతో టెస్టు.. రూ.60కే టికెట్

క్రికెట్ అంటే భారత్‌లో ఓ ఎమోషన్. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. T20ల ప్రభావమో, ఏమో టెస్టులకు ఆదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌కు ప్రేక్షకుల స్పందన చూస్తే అదే అనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కోల్‌కతా వేదికగా (Nov 14-18) సౌతాఫ్రికాతో భారత్ తలపడే తొలి టెస్టుకు టికెట్ ప్రారంభ ధర రోజుకు రూ.60గా నిర్ణయించారు. ఇవాళ మ.12 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
News October 20, 2025
వీరికి వారం ముందు నుంచే ‘దీపావళి’

మనం దీపావళి ఏ రోజైతే ఆరోజే వేడుకలు చేసుకుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని సెమ్రా గ్రామంలో దీపావళి వేడుకలు వారం ముందు నుంచే మొదలవుతాయి. ఈ ఆచారం వెనుక ఓ కారణం ఉంది. పూర్వం సింహం దాడిలో మరణించిన సర్దార్ దేవ్, గ్రామ పూజారి కలలోకి వచ్చి దీపావళి పండుగను ముందే జరపాలని చెప్పాడట. అలా చేయకపోతే దురదృష్టం కలుగుతుందని హెచ్చరించాడట. అప్పటి నుంచి అక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఊర్లో OCT 20నే దీపావళి మొదలైంది.
News October 20, 2025
APPLY NOW: SECIలో 32 పోస్టులు

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) 32 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 24, సీనియర్ కన్సల్టెంట్(10) పోస్టులకు ఈనెల 29 ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్, డిప్లొమా, ITI, CA, MBA(Fin) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.seci.co.in/