News October 19, 2025
దీపావళి: రేపు పొద్దున్నే స్నానం చేస్తే..?

దీపావళి రోజున తెల్లవారుజామునే స్నానం చేయడం ఎంతో శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యోదయానికి నాలుగు ఘడియల ముందు నువ్వుల నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేయాలని సూచిస్తున్నారు. ‘నేడు నీటిలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి గంగా స్నాన ఫలం లభిస్తుంది. స్నానానంతరం తెలుపు వస్త్రాలు ధరించి, మినప ఆకు, మినపప్పుతో చేసిన వంటకాలు తినాలి’ అని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలు పాటించడం శుభప్రదం.
Similar News
News October 19, 2025
మళ్లీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ!

TG: స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హులని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం పంచాయతీ రాజ్ చట్టం-2018, 21(ఏ)ను సవరణ చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ శాఖను ఆదేశించింది. ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో అమల్లోకి వస్తుంది. గతంలో గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం, స్థానిక ఎన్నికలకు చేసిన రిజర్వేషన్లు తదితరాల కోసం చట్టాన్ని సవరించారు.
News October 19, 2025
దీపావళి: లక్ష్మీ పూజలో ఏ వస్తువులు ఉండాలి?

దీపావళి లక్ష్మీ పూజలో సమర్పించే కొన్ని వస్తువులు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ చిత్ర పటాలు పెడితే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవతల నివాసంగా పేర్కొనే శంఖాన్ని, సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి నాణేలు, నోట్లు, పసుపు గౌరమ్మలను పూజలో ఉంచాలని సూచిస్తున్నారు. కమల పువ్వులు, శ్రీ యంత్రం, పసుపు కొమ్ములు ఉంచడం అదృష్టాన్ని తెస్తుందంటున్నారు.
News October 19, 2025
కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.