News October 19, 2025
దీపావళి: లక్ష్మీ పూజలో ఏ వస్తువులు ఉండాలి?

దీపావళి లక్ష్మీ పూజలో సమర్పించే కొన్ని వస్తువులు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ చిత్ర పటాలు పెడితే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవతల నివాసంగా పేర్కొనే శంఖాన్ని, సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి నాణేలు, నోట్లు, పసుపు గౌరమ్మలను పూజలో ఉంచాలని సూచిస్తున్నారు. కమల పువ్వులు, శ్రీ యంత్రం, పసుపు కొమ్ములు ఉంచడం అదృష్టాన్ని తెస్తుందంటున్నారు.
Similar News
News October 19, 2025
వాళ్లిద్దరికీ ప్రజలే శిక్ష విధిస్తారు: మావోయిస్టులు

మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల లొంగిపోవడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో 4 పేజీల లేఖను విడుదల చేసింది. ‘మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా మారారు. వాళ్లిద్దరికీ ప్రజలే శిక్ష విధిస్తారు. ఆయుధాలను విడిచిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ప్రాణభీతితో కొందరు లొంగిపోతుండవచ్చు. ఇది తాత్కాలిక నష్టం మాత్రమే’ అని లేఖలో పేర్కొంది.
News October 19, 2025
అభ్యర్థులే CHSLE సెంటర్ ఎంచుకునే అవకాశం

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్(CHSLE -2025) టైర్ 1 పరీక్ష నవంబర్ 12న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అనుకూలమైన సిటీ, షిఫ్ట్‌ను ఎంచుకునే సౌకర్యంను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కల్పించింది. అభ్యర్థులు SSC పోర్టల్‌లో లాగిన్ అయి నగరం (దరఖాస్తు సమయంలో ఎంచుకున్న మూడు నగరాల్లో ఒకటి), తేదీ, షిఫ్ట్‌ను ఎంచుకోవచ్చు. పోర్టల్ విండో అక్టోబర్ 22 నుంచి 28 వరకు ఓపెన్ అవుతుంది.
News October 19, 2025
మ్యాచ్ రీస్టార్ట్.. 26 ఓవర్లకు కుదింపు

భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కారణంగా అంపైర్లు ఓవర్లను 26కు కుదించారు. వర్షం కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ రీస్టార్ట్ అయింది. 18 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. అక్షర్(25*), రాహుల్ (5*) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో కనీసం 130 రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే భారత్ పోరాడేందుకు అవకాశం ఉండనుంది.