News September 5, 2025
నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: CP

TG: HYD వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గతేడాది డీజే చప్పుళ్లతో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సహకరిస్తోందన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఉ.6 గంటలకు ప్రారంభమై మ.1.30 గంటలలోపు పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 29వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 5, 2025
స్కాంల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం: జగన్

AP: ప్రజల ఆస్తులను CM చంద్రబాబు తనవాళ్లకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం ప్రైవేటుపరం చేస్తున్నారు. మా 5ఏళ్లలో 17కాలేజీల్లో 5చోట్ల క్లాసులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు మీరు బాధ్యతగా చేసి ఉంటే మరో 12 కాలేజీల్లోనూ క్లాసులు స్టార్ట్ అయ్యేవి. మేం అధికారంలోకి రాగానే ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’ అని ట్వీట్ చేశారు.
News September 5, 2025
హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్‌వన్: చంద్రబాబు

AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్‌వన్‌గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
News September 5, 2025
అందుకే VRO, VRAలను BRS తొలగించింది: CM రేవంత్

TG: ధరణి పేరిట ధన, భూదాహంతో BRS ప్రభుత్వం భూములన్నీ చెరబట్టిందని CM రేవంత్ విమర్శించారు. తమ దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదనే VRO, VRAలను తొలగించారన్నారు. ఎన్నికల ముందు ఎవరిని కదిలించినా ధరణి గురించే చెప్పేవారని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామన్న హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తున్నామని GPO నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.