News November 28, 2025
DKకి మద్దతు తెలిపిన స్వామీజీ ఎవరో తెలుసా?

కర్ణాటకలో <<18406507>>అధికార పోరు<<>> కొనసాగుతున్న వేళ ఇటీవల ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ డీకే శివకుమార్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్వామీజీ ఎవరనే చర్చ మొదలైంది. 72వ పీఠాధిపతిగా ఉన్న ఈయన ఆదిచుంచనగిరి వర్సిటీ ఛాన్సలర్‌గానూ, 500కు పైగా విద్యాసంస్థలను పర్యవేక్షించే ట్రస్ట్‌కి అధ్యక్షుడిగానూ ఉన్నారు. స్వామీజీ సివిల్ ఇంజినీరింగ్ చేసి, చెన్నై IIT నుంచి MTech, ఫిలాసఫీలో PhD చేశారు.
Similar News
News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


