News August 29, 2024
డీకే శివకుమార్‌కు హైకోర్టులో ఊరట

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ CM డీకే శివకుమార్‌పై విచారణ కొనసాగింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. రూ.74 కోట్ల ఆదాయం విషయంలో గత యడియూరప్ప సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీంతో ఈ కేసులో సీబీఐ సహా బీజేపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది.
Similar News
News November 28, 2025
మరిపెడలో అత్యధికం.. చిన్నగూడూరులో అత్యల్పం!

మహబూబాబాద్ జిల్లాలో 482 గ్రామపంచాయతీలు, 4110 వార్డు స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అత్యధికంగా మరిపెడ మండలంలో ఉండగా.. అత్యల్పంగా చిన్నగూడూరు మండలంలో ఉన్నాయి. మరిపెడ(M)లో 48 పంచాయతీలు, 396 వార్డులు ఉన్నాయి. చిన్నగూడూర్(M)లో 11 గ్రామ పంచాయతీలు, 96 వార్డులు ఉన్నాయి.
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.
News November 28, 2025
త్వరలో.. ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు!

ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. ‘Aadhaar’ యాప్ ద్వారా OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవ త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొంటూ యాప్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకూ మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. ఇక్కడ క్లిక్ చేసి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. SHARE IT


