News June 25, 2024

DLS సహ రూపకర్త డక్‌వర్త్ మ‌ృతి

image

డక్‌వర్త్-లూయిస్‌-స్టెర్న్ విధానాన్ని కనిపెట్టినవారిలో ఒకరైన ఫ్రాంక్ డక్‌వర్త్(84) ఈ నెల 21న కన్నుమూశారని క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. వర్షంతో ప్రభావితమయ్యే క్రికెట్‌ మ్యాచుల్లో ఫలితాలను రాబట్టేందుకు, కుదించాల్సిన ఓవర్లను, ఛేదించాల్సిన లక్ష్యాలను అంచనా వేసేందుకు టోనీ లూయిస్‌తో కలిసి ఆయన ఈ విధానాన్ని కనిపెట్టారు. లూయిస్ 2020లో చనిపోయారు. 1997 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో DLSను వాడుతున్నారు.

Similar News

News December 9, 2025

విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

image

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్‌బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News December 9, 2025

‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

image

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.

News December 9, 2025

IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

image

<>IIIT<<>> కొట్టాయం 13 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, LLB, MBA, ఇంజినీరింగ్, డిప్లొమా, MSc, MCA, ఇంటర్+ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/టెక్నికల్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitstaff.iiitkottayam.ac.in