News February 13, 2025
DMEని కలిసిన ASF జిల్లా AITUC నాయకులు

జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని DMEకి ఏఐటీయూసీ నాయకులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News December 7, 2025
మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం: ఎస్పీ

ఆరోగ్యవంతమైన సమాజానిర్మానానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని SP జగదీశ్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో’ అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ యువత భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య అన్నారు. ఈ ర్యాలీ వంటి కార్యక్రమాలు యువతలో అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తాయన్నారు. మత్తు పదార్థాలకు ఆరోగ్యానికి హానికరమన్నారు.
News December 7, 2025
శ్రీకాకుళంలో 104 ఉద్యోగులు నిరసన

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే 104 వాహనాల సిబ్బంది వేతన సమస్యలు, గ్రాట్యువిటీ, ఎర్న్డ్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిబ్బందిలో ఆందోళన నెలకొందని యూనియన్ నేతలు పేర్కొన్నారు.
News December 7, 2025
KNR: ఎమ్మెల్యేలూ.. నియోజకవర్గాలు విడిచి వెళ్లొద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేవరకు MLAలు నియోజకవర్గాలు వదిలి బయటకు రావద్దని PCC ఆదేశించినట్లు తెలుస్తోంది. గెలిచిన సర్పంచి స్థానాలను బట్టే MLAల పనితీరుకు గ్రేడింగ్ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీంతో MLAలు నియోజకవర్గంలో తిష్ట వేసి ప్రతి గ్రామం విజయావకాశాలపై సమీక్షిస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిపించి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టాలని ఉమ్మడి జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.


