News October 28, 2024
BJPకి విజయ్ C-Team అంటూ DMK ఫైర్
దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగంపై అధికార DMK అప్పుడే విమర్శలు ఎక్కుపెట్టింది. BJPకి TVK సీ-టీం అంటూ విమర్శించింది. డీఎంకే విధానాలను కాపీకొట్టి ద్రవిడీయన్ మోడల్ ప్రభుత్వాన్ని తమిళనాడు నుంచి ఎవరు వేరు చేయలేరని విజయ్ నిరూపించారని మంత్రి రేగుపతి పేర్కొన్నారు. అన్నాడీఎంకే క్యాడర్ను తనవైపు తిప్పుకోవడానికే ఆ పార్టీని విజయ్ పల్లెత్తుమాట అనలేదని విమర్శించారు.
Similar News
News November 1, 2024
ఆ విషయంలో జగన్కు ఆస్కార్ ఇవ్వొచ్చు: నిమ్మల
AP: ప్రపంచంలో తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్ లాంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించరని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు. పోలవరం ఎత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాల్లో జగన్కు ఆస్కార్ ఇవ్వొచ్చని చురకలంటించారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది జగన్ కాదా అని నిలదీశారు.
News November 1, 2024
జీవితానికి ఆ ఒక్క సెకను చాలు: మలైకా
బాలీవుడ్ ప్రేమజంట అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపావళి పార్టీలో తాను సింగిల్ అంటూ అర్జున్ చేసిన <<14479913>>వ్యాఖ్యలు<<>> ఇందుకు బలం చేకూర్చాయి. ఈ నేపథ్యంలో మలైకా ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘హృదయాన్ని ఒక్క సెకను తాకితే అది జీవితాంతం ఆత్మను తాకవచ్చు’ అని ఆమె రాసుకొచ్చారు. దీనికి అర్థమేమిటి? తన లవ్ లైఫ్ గురించేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 1, 2024
కత్తులతో దాడి.. ముగ్గురు మృతి
AP: దీపావళి పండుగ రోజున కాకినాడ జిల్లాలో ఘర్షణ చెలరేగింది. కాజులూరు(మ) సలపాకలో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా, ముగ్గురు చనిపోయారు. పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వాగ్వాదం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.