News August 28, 2024
DMK MP కుటుంబానికి రూ.908కోట్ల ఫైన్

తమిళనాడుకు చెందిన DMK MP S.జగత్‌రక్షకన్ సహా ఆయన కుటుంబానికి భారీ జరిమానా పడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.908కోట్ల పెనాల్టీ విధించింది. దీంతో పాటు FEMA చట్టం కింద రూ.89కోట్ల ఆస్తులను కూడా సీజ్ చేసింది. FEMA నిబంధనలు ఉల్లంఘిస్తూ విదేశీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు 2021 డిసెంబర్‌లో ఈడీ కేసు నమోదు చేసింది. జగత్‌రక్షకన్ అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News March 27, 2026
రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. APR 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఆస్కారముందని చెప్పింది. ఇక రేపు 8.30am వరకు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 27, 2026
విజయ్, త్రిష రిలేషన్.. సముద్రఖని ఏమన్నారంటే?

TVK చీఫ్ విజయ్, త్రిష కలిసి రిసెప్షన్‌కు హాజరవడంపై తాను చేసిన కామెంట్లను నటుడు, డైరెక్టర్ సముద్రఖని సమర్థించుకున్నారు. ‘రాజకీయాల్లో విజయ్‌ను తొలుత సపోర్ట్ చేసింది నేనే. అందుకే నా బాధను వ్యక్తం చేశా. వీడియో తీస్తున్న వ్యక్తి నా మాటలను మధ్యలో రికార్డ్ చేశాడు’ అని పేర్కొన్నారు. వారి రిలేషన్ గురించి గతంలో సముద్రఖని మాట్లాడుతూ ‘ఇదేమైనా ఆటా? వ్యక్తిగత విషయాలు అందరికీ తెలియాలా?’ అంటూ మండిపడ్డారు.
News March 27, 2026
ఇన్ఫెక్షన్లతో గుండెపోటు.. వైద్యుల సలహా ఇదే!

రక్తపరీక్షలు సాధారణంగా ఉన్నా, స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఇవి శరీరంలో వాపును పెంచి, రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల ధమనుల్లోని ప్లాక్ పగిలి ఆకస్మిక గుండెపోటుకు దారితీయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయకండి. నోటి పరిశుభ్రత పాటించండి. గుండె ఆరోగ్యం కోసం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడమూ ముఖ్యమే’ అని సూచిస్తున్నారు.


