News July 10, 2025

రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్

image

AP: మామిడి రైతులు సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కళ్లకు దొంగలు, రౌడీల్లాగా కనిపిస్తున్నారా? అని మాజీ CM జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవకపోగా వారిపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాల సమస్యను గాలికొదిలేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు అండగా నిలబడండి’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Similar News

News July 11, 2025

EP-4: ఈ 3 విషయాలు మీ పిల్లలను హీరోలను చేస్తాయి: చాణక్య నీతి

image

పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే వారికి ఈ 3 విషయాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలని చాణక్యుడు తెలిపారు. పిల్లలు సత్యమార్గం అనుసరించేలా చేయాలి. అబద్ధాలతో కలిగే అనర్థాలను వివరించాలి. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి. అదే వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుంది. చిన్నప్పటి నుంచే వారికి విలువలు నేర్పాలి. పెద్దలను గౌరవించడం, తోటి వారితో మానవత్వంతో మెలగడం వంటివి నేర్పించాలి.
<<-se>>#Chanakyaneeti<<>>

News July 11, 2025

డేటా అవసరం లేని వారికోసం Airtel కొత్త ప్లాన్

image

ఎయిర్‌టెల్ సంస్థ కస్టమర్స్ కోసం కొత్తగా రూ.189 ప్లాన్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. డేటా కోసం కాకుండా నంబరును యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి, ఇంటర్నెట్ పెద్దగా వాడని పేరెంట్స్‌కి ఈ ప్లాన్ యూజ్ అవుతుంది. ఈ ప్లాన్‌ 21 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్ని నెట్వర్కులకు అపరిమిత వాయిస్ కాల్స్, 1GB మొబైల్ డేటా, 300 SMSలు వస్తాయి. అయితే ఇది డేటా ఎక్కువగా వాడే వారికి అంత ఉపయోగంగా ఉండదు.

News July 11, 2025

అరుదైన ఘనత.. వరుస ఓవర్లలో 2 హ్యాట్రిక్స్

image

ENG సఫోల్క్ కౌంటీకి చెందిన కిశోర్ కుమార్ సాధక్ అనే 37 ఏళ్ల స్పిన్నర్ రేర్ ఫీట్ సాధించారు. UKలోనీ టూ కౌంటీస్ ఛాంపియన్‌షిప్‌లో కెస్‌గ్రేవ్‌తో జరిగిన డివిజన్ మ్యాచ్‌లో వరుసగా 2ఓవర్లలో 2హ్యాట్రిక్స్ నమోదు చేశారు. ఇప్స్‌విచ్ & కోల్చెస్టర్ తరఫున బరిలోకి దిగిన సాధక్ 6 ఓవర్లేసి 20 రన్స్ ఇచ్చి ఆరుగురిని అవుట్ చేశారు. వారిలో ఐదుగురు డకౌట్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సాధక్ జట్టు 7వికెట్ల తేడాతో గెలిచింది.