News July 20, 2024
గంట గంటకూ సమీక్షలు చేయండి: ఉత్తమ్

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోని నీటిపారుదల శాఖ CEలు అందుబాటులో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ‘హెడ్ క్వార్టర్స్ను వదిలి ఎవరూ వెళ్లొద్దు. ప్రాజెక్టుల్లోకి గంట గంటకూ వచ్చే ప్రవాహాలను పర్యవేక్షించండి. SOP ప్రకారం నీరు విడుదల చేయండి. నీటి విడుదలకు ముందు దిగువ ప్రాంతాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయండి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి’ అని ఆయన సూచించారు.
Similar News
News December 6, 2025
తిరుపతి: స్థానిక MP ప్రొటోకాల్ లేదా..?

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శనివారం అంబేడ్కర్ వర్ధంతి జరగనుంది. ఈ కార్యక్రమానికి స్థానిక MP డాక్టర్ గురుమూర్తికి ఆహ్వానం లభించలేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఆహ్వాన పత్రికలో ఆయన పేరు లేకపోవడం దీనికి నిదర్శనంగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలో స్థానిక MP ప్రొటోకాల్ పాటించకపోవడం పట్ల వైసీపీ నాయకులు, విద్యావేత్తలు అధికారులు తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News December 6, 2025
TODAY HEADLINES

* గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్
* రష్యా ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ
* ముగిసిన పుతిన్ పర్యటన.. కీలక ఒప్పందాలు
* 1000 ఇండిగో సర్వీసులు రద్దు.. CEO సారీ
* వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: CBN
* DEC 30, 31, JAN 1వ తేదీల్లో సాధారణ దర్శనాలు రద్దు: TTD
* ఇందిరమ్మ ఇల్లులేని ఊరు లేదు: రేవంత్
* ‘హిల్ట్’ కేసు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
* అఖండ-2 సినిమా విడుదల వాయిదా
News December 6, 2025
త్వరలో అఖండ-2 మూవీ కొత్త రిలీజ్ డేట్

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన <<18465729>>అఖండ-2<<>> చిత్రం రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. రేపైనా సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే మూవీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ‘సినిమాని విడుదల చేసేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్, మూవీ లవర్స్ మమ్మల్ని క్షమించాలి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేసింది.


