News September 27, 2024
తిరుపతి వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ కావాలా?: అంబటి

AP: తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ఎందుకు నోటీసులు పంపుతున్నారని నిలదీశారు. ‘జగన్ తిరుమల టూర్ను ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఆయన ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అనడం సిగ్గుచేటు. దీనిపై రాజకీయం చేస్తే ప్రజలు, దేవుడే మిమ్మల్ని శిక్షిస్తాడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


