News October 1, 2024

కేటీఆర్, హరీశ్‌కు మానవత్వం ఉందా?: కోమటిరెడ్డి

image

TG: మీకు గోదావరి నీళ్లు.. మాకు మూసీ నీళ్లా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించారు. వారికి అసలు మానవత్వం ఉందా అని ఆయన నిలదీశారు. ‘మిమ్మల్ని ఓడించినందుకు నల్గొండ ప్రజలపై కక్ష గట్టారు. నల్గొండ అంటే ఎందుకంత కోపం? మూసీ ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డుపడితే ప్రత్యక్ష ఉద్యమం చేపడతాం’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News October 12, 2024

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

image

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకు ఇకపై 17 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. మండలం మకరవిళక్కు సీజన్‌ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మ.ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News October 12, 2024

అలియా భట్ కుమార్తెకు రామ్ చరణ్ ‘ఏనుగు గిఫ్ట్’!

image

రామ్ చరణ్‌కు తనకు మధ్య చక్కటి స్నేహం ఉందని అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కుమార్తె రాహా పేరు మీద ఓ అడవి ఏనుగును దత్తత తీసుకుని చెర్రీ దాని ఆలనాపాలనా చూస్తున్నారని ఆమె కొనియాడారు. దత్తతకు సూచనగా ఓ ఏనుగు బొమ్మను రాహాకు గిఫ్ట్‌గా పంపించారని, రాహా రోజూ ఆ ఏనుగుపైకెక్కి ఆడుకుంటుందని వివరించారు. చెర్రీ, అలియా కలిసి RRRలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే.

News October 12, 2024

BSNL: రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే..

image

యూజర్ల కోసం BSNL మరో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే 105 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, నిత్యం 2GB హైస్పీడ్ డేటా, 100 SMSల ప్రయోజనాన్ని పొందొచ్చు. జియో, ఎయిర్‌టెల్, VIలో ఇటీవల రీఛార్జ్ ధరలు భారీగా పెరగడంతో BSNLకు పోర్ట్ అవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే నెట్‌వర్క్ సమస్యను పరిష్కరిస్తే మరింతమంది యూజర్లు పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.