News December 5, 2024
హరీశ్ రావును అరెస్టు చేయొద్దు.. హైకోర్టు ఆదేశం

TG: BRS సీనియర్ నేత హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట PSలో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీశ్ రావు సహకరించాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ హరీశ్ రావుపై ఫిర్యాదు చేశారు.
Similar News
News March 26, 2026
శ్రీరామ నవమి రోజున ఏం చేయాలంటే?

రేపే శ్రీరామ నవమి. వేకువజామునే నిద్రలేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. మంగళ స్నానాలు ఆచరించి, ఇంటిని మామిడి తోరణాలు, ముంగిట రంగవల్లికలతో అలంకరించుకోవాలి. సీతారాముల పటాలకు పూజ చేసి.. బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే సమీపంలోని రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. రామనామ స్మరణతో ఈ రోజంతా గడపడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
News March 26, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.
➤ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
➤ మైనింగ్ లీజులను వడ్డెర సొసైటీలకు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం
➤ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీ
➤ 96 jr., sr. సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం
➤ 2025-26 ఏడాదిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ
News March 26, 2026
నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.


