News April 25, 2024

లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి: ACB

image

TG: ACB డీజీ CV ఆనంద్ ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్‌ను ఆనంద్ ఆవిష్కరించారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. లేదా dgacb@telangana.gov.inకి మెయిల్ చేయాలన్నారు.

Similar News

News October 31, 2025

శివమ్ దూబే ‘అన్‌బీటెన్’ రికార్డుకు బ్రేక్

image

2019 నుంచి ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉన్న 37 T20Iల్లో భారత్ గెలిచింది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో ఆ లాంగెస్ట్ అన్‌బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. అలాగే 2021 నుంచి బుమ్రా ఆడిన 24 మ్యాచుల్లో టీమ్ ఇండియా గెలవగా ఇవాళ పరాజయం పాలయ్యింది. ఉగాండాకు చెందిన పస్కల్ మురుంగి(2022-24) 27*, మనీశ్ పాండే(2018-20) 20* రికార్డులు అలాగే ఉన్నాయి.

News October 31, 2025

హార్ట్ ఎటాక్‌ను నివారించే మందుకు FDA అనుమతి

image

హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌ ప్రమాదాన్ని నివారించే Rybelsus మందుకు అమెరికన్ FDA ఆమోదం తెలిపింది. ఇది నోటితో తీసుకునే తొలి GLP-1 ఔషధం కావడం గమనార్హం. ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ రోగులు Rybelsusను వాడుతుండగా తాజాగా హృద్రోగులకూ విస్తరించారు. రక్తంలో చక్కెర స్థాయులు, ఆకలిని అదుపులో ఉంచడంతోపాటు గుండెపోటుకు ప్రధాన కారణాలైన రక్తనాళాల వాపు(ఆర్టీరియల్ ఇన్‌ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇది తగ్గిస్తుంది.

News October 31, 2025

అందుకే బంగ్లాదేశ్‌ను వీడాను: షేక్ హసీనా

image

తప్పనిసరి పరిస్థితుల వల్లే దేశాన్ని వీడానని బంగ్లాదేశ్ Ex PM షేక్ హసీనా తెలిపారు. తాను అక్కడే ఉండుంటే తనతోపాటు చుట్టూ ఉన్న వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నా. ఆగస్టులో జరిగినది హింసాత్మక తిరుగుబాటు. బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నాకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అది బూటకపు విచారణ’ అని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.