News November 19, 2024
మహిళల ఇంటి పేరు సర్టిఫికెట్లతో సరిపోలకున్నా ఓటు తిరస్కరించొద్దు: EC

AP: ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్ల జాబితాపై EC కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాహమైన మహిళా ఓటర్ల ఇంటిపేరు ధ్రువపత్రాలతో సరిపోలకున్నా తిరస్కరించవద్దని ఎమ్మార్వోలకు సూచించింది. ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు డిసెంబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను పరిశీలించాలని తహశీల్దార్లను ఆదేశించింది.
Similar News
News December 27, 2025
CBSEలో 124 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

CBSEలో 124 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, Jr. ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, Jr. అకౌంటెంట్, Jr. అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, డిగ్రీ, PG, B.Ed/M.Ed, NET/SET, PhD, MBA, CA, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.cbse.gov.in
News December 27, 2025
వెండి, బంగారం దానం చేస్తే?

వెండి దానంతో చంద్రుని అనుగ్రహం లభించి మనశ్శాంతి కలుగుతుంది. బంగారం దానం చేస్తే జాతకంలోని దోషాలు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. గోదానంతో పితృదేవతల ఆశీస్సులు దక్కుతాయి. అలాగే సమస్త రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక భూదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఏ దానమైనా ప్రతిఫలం ఆశించకుండా, భక్తితో సమర్పించినప్పుడే మనకు పూర్తి పుణ్యం దక్కుతుంది. సాధ్యమైనంతలో ఇతరులకు మేలు చేయడం శుభకరం.
News December 27, 2025
మేం ఇండియాకు వెళ్లం: బంగ్లా హిందువులు

దాడులు జరుగుతున్నా తాము ఇండియాకు వెళ్లబోమని ఢాకాలోని హిందువులు NDTVతో స్పష్టం చేశారు. ‘మేము హిందువులమనే కారణంతోనే రాడికల్ ఇస్లామిస్టులు మాపై దాడి చేస్తున్నారు. మమ్మల్ని భారతీయ ఏజెంట్లు అని పిలుస్తున్నారు. ఇండియాకు వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. దానికి మేం ఒప్పుకోం. మేము భారతీయులం కాదు. బంగ్లాదేశీ హిందువులం. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం. ఇది మా దేశం. యూనస్ ప్రభుత్వం విఫలమైంది’ అని పేర్కొన్నారు.


