News October 11, 2024
ఆ 2 నగరాల్లో పావురాలు ఎగరొద్దు: పాకిస్థాన్ ఆదేశం

ఉగ్రవాదాన్ని ఎగుమతిచేసే పాకిస్థాన్ ఇప్పుడు వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. SCO సమ్మిట్కు భద్రత కల్పించడం తలకు మించిన భారంగా మారింది. OCT 12 నుంచి 16 వరకు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను షట్డౌన్ చేస్తోంది. ఇక్కడ పావురాలు, గాలిపటాలు ఎగరకూడదని ఆదేశించింది. అందుకని పావురాల గూళ్లను తొలగించాలని సూచించింది. దీంతో మహిళా పోలీసుల సాయంతో 38 రూఫ్టాప్స్పై గూళ్లను తీసేసింది డిపార్ట్మెంట్.
Similar News
News January 24, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,470 పెరిగి రూ.1,58,620కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,350 ఎగబాకి రూ.1,45,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,60,100 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
News January 24, 2026
Republic day Special: అరుణా అసఫ్ అలీ

అరుణా అసఫ్ అలీ గొప్ప దేశభక్తురాలు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించడంతో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 1942లో అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు. 1997లో మరణాంతరం ప్రభుత్వం ఆమెకు ‘భారతరత్న’ ప్రదానం చేసింది.
News January 24, 2026
ఢిల్లీ.. ఊపిరి పీల్చుకో!

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. వర్షాలు, గాలి వేగం పెరగడంతో వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత కొద్దిగా మెరుగైంది. సగటున AQI 249 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో కొన్ని నెలలుగా అక్కడి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కురుస్తోంది.


